ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుల ముఖ్య సమావేశం
ప్రకాశం జిల్లా **జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశంలో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంను జనసేన నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది.** అలాగే ఈ సమావేశంలో జనసేన నాయకులతో ఎన్డీఏ కూటమి పార్టీలతో సమన్వయం పాటించి ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రామ్ కమిటి సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు మరియు ఆవుల వెంకట్, జిల్లా లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ శైలజ, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జనసేన వీర మహిళలు పిన్నెబోయిన లక్ష్మీ రాజ్యం, పూజా లక్ష్మీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.